Lyrics has been copied to clipboard!
Charge (n) : తెలుగు అర్థం/అర్ధాలు: భారం, బరువు,ఖర్చు, వ్యయం, వెల, ఖరీదు,ఆరోపణ, బాధ్యత, అధీనత, ఆవేశం,ఫిర్యాదు, నేరం,అధికారం, నిందారోపణ, ఉత్తరువు.care custody వశము, అధీనము. expense, cost వ్రయము, శెలవు, వెల కూలి. he bore my charges నాకు పట్టిన శెలవు అతని పెట్టుకొన్నాడు. he got it free of charge వాడికి అది తేరకు వచ్చినది. accuation, imputation నింద, నెపము, అపరాధము. a false * అపనింద, అపోహము, అభాండము, తప్పు ఫిర్యాదు he filed a * against them వాండ్ల మీద ఫిర్యాదు వ్రాసి దాఖలు చేసినాడు. Onset or attack ఆ క్రమణము, యెదిరింపు, ధాటి. he brought his spear to the * ఈటెతో పొడవవచ్చినాడు. Commission,trust conferred, భారము, బరువు. the prisoner was in my * or, I wasin * of the prisoner ఆ ఖైది నా వశములో వుండినాడు. he was in * of thehouse; or, the house was in his * ఆ యిల్లు వాడిపరముగా వుండినది I was in * of the school in his absence వాడు లేనప్పుడు నేను ఆ పల్లె కూటము చెప్పుతూ వుంటిని. his children are my * వాడి బిడ్డలు నా పోషణలో వున్నారు. of powder and ball in a gun ఘట్టించి వుండే మందుగుండు, బారు చేసి వుండే మందుగుండు. he lodged the * in my leg వాడు కాల్చిన గుండు నా కాలిలో పారినది. he drow the * of his gun ఘట్టించివుండే మందుగుండును బైటికి తీసివేసినాడు. precept, command ఆజ్ఞ, a speech బిషపుగాని, న్యాయాధిపతి గాని చెప్పే బోధ. the judge delivered a charge to the jury న్యాయాధిపతి జూరీలకు బోధ చేసినాడు. he took * of the house ఆ యింటిని వొప్పగించుకొన్నాడు, వశము చేసుకొన్నాడు. he gave me * of the house ఆ యింటిని నాకు వొప్పగించినాడు.